లోకం తెలీని స్థితిలో తండ్రి..లోకానికి అందకుండా కొడుకు!

లోకం తెలీని స్థితిలో తండ్రి..లోకానికి అందకుండా కొడుకు!
x
Highlights

కాఫీడే వ్యవస్థాపక చైర్మన్ సిద్ధార్ధ తిరిగిరాని రాణి లోకాలకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని తెలుసుకోలేని స్థితిలో ఆయన తండ్రి ఉన్నారు....

కాఫీడే వ్యవస్థాపక చైర్మన్ సిద్ధార్ధ తిరిగిరాని రాణి లోకాలకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని తెలుసుకోలేని స్థితిలో ఆయన తండ్రి ఉన్నారు. సిద్ధార్థ తండ్రి గంగయ్య. ఈయన గత పదిరోజులుగా కోమాలో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడురోజుల క్రితం సిద్దార్థ ఆసుపత్రికి వెళ్లి తండ్రిని చూసి వచ్చారు. ఆ సమయంలో తండ్రి పరిస్థితి చూసి అయన కన్నీటి పర్యంతం అయ్యారట.

ఇప్పుడు సిద్దార్థ ఈ లోకంలో లేరు. కొడుకు మారణ విషయం తెలుసుకునే స్థితిలో తండ్రి లేరు. చిక్ మగళూర్ లో కాఫీ సాగు చేసేవారు గంగయ్య. ఆయనకు లేక లేక పుట్టిన సంతానం సిద్దార్థ. చాలా గారాబంగా పెంచారు. కష్టమే తెలీకుండా పెరిగిన సిద్ధార్థ కాఫీడే స్థాపించి ఉన్నత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అనుకోని పరిస్థితిలో అయన మరణించారు. తన గారాల బిడ్ద చనిపోయారని తెలుసుకోలేని స్థితిలో ఆ తండ్రి ఉన్నారు. ఇది బంధువులకు మరింత దుఃఖం కలిగిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories