Eknath Shinde: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను కలిసిన సీఎం ఏక్‌నాథ్ షిండే

Eknath Shinde: సల్మాన్‌ఖాన్‌ను కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం షిండే

Shashank Gullapelli
Published on: 16 April 2024 8:20 PM IST
CM Eknath Shinde Meet Bollywood Star Salman Khan
X

Eknath Shinde: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను కలిసిన సీఎం ఏక్‌నాథ్ షిండే 

Eknath Shinde: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కలిశారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న సల్మాన్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. అనంతరం సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర భద్రతను పెంచాలని అధికారులున ఆదేశించారు.

ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్‌ ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన దుండగులు గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విక్కీ సాహబ్‌ గుప్తా, సాగర్‌ శ్రీజోగేందర్‌ పాల్‌గా గుర్తించారు. వీరిద్దరు నవీ ముంబైలోని పన్వెల్‌లో ఉన్న హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లు అధికారుల విచారణలో తేలింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story