బోరుబావిలో పడిన ఆరేళ్ల చిన్నారి.. ప్రాణాలతో చిన్నారి బయటకు రావాలని స్థానికుల ప్రార్థనలు..
Uttar Pradesh: బోరు బావులు చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్నా... ఎవరి నిర్లక్ష్యం వారిదే.
బోరుబావిలో పడిన ఆరేళ్ల చిన్నారి.. ప్రాణాలతో చిన్నారి బయటకు రావాలని స్థానికుల ప్రార్థనలు..
Uttar Pradesh: బోరు బావులు చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్నా... ఎవరి నిర్లక్ష్యం వారిదే. తాజాగా ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో ఈ ఘటన రిపీట్ అయ్యింది. ఇవాళ ఆడుకుంటూ తెరచివున్న బోరుబావివైపు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి దానిలో పడిపోయింది. కోట్ల సాదత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు, ఫైర్ సిబ్బంది, NDRF బలగాలు సహాయ చర్యలు చేపట్టారు.
చిన్నారి బోరుబావిలో పడిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు భయాందోళన చెందుతున్నారు. తరచూ జరుగుతున్న బోరుబావి ఘటనలు పిల్లలపాలిట శాపంగా మారుతున్నాయి. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే దాన్ని పూర్తిగా మూసివేయాలి. అలా కాకుండా తమకేం పట్టనట్టు యజమానులు ఆ బోరుబావులను అలాగే బార్లా తెరిచే ఉంచుతున్నారు. ఇలా పెద్దల నిర్లక్ష్యం చిన్నారులకు ప్రాణసంకటంగా మారుతోంది. తాజాగా బోరుబావిలో పడిన చిన్నారి క్షేమంగా రావాలని అక్కడి జనం కోరుకుంటున్నారు.




