Chhattisgarh: పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురి మృతి

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌ బీజాపూజ్ జిల్లా సిల్గేర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 18 May 2021 10:51 AM IST
Chhattisgarh: Three people killed in an Exchange of Fire Between Security Forces and Maoists
X

Chhattisgarh: పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురి మృతి

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌ బీజాపూజ్ జిల్లా సిల్గేర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిల్గేర్ దగ్గర పోలీసులు కొత్తగా శిబిరం ఏర్పాటు చేశారు. దానిని తొలగించాలని గ్రామస్తులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. అయితే.. దానికి పోలీసులు ససేమిరా అనడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఆదివాసులు చనిపోయారు. దాంతో సహనం కోల్పోయిన ఆదివాసులు పోలీసు శిబిరంపై గ్రామస్తులు దాడి చేశారు. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారని ఈ కాల్పుల్లో కొంతమంది మావోస్టులు కూడా చనిపోయినట్టు ఛత్తీస్‌ఘడ్ ఐజీ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story