Chennai Woman Accuses on ABVP National President: ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు నిర్వాకం.. మహిళ ఫిర్యాదు..

Chennai Woman Accuses on ABVP National President: పార్కింగ్‌ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై కేసు నమోదయింది. పార్కింగ్ స్థలం వివాదంతో పాటు తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బయ్య షణ్ముగంపై 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Raj
By Raj
Published on: 25 July 2020 6:48 PM IST
Chennai Woman Accuses on ABVP National President: ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు నిర్వాకం.. మహిళ ఫిర్యాదు..
X
Chennai Woman Accuses on ABVP National President

Chennai Woman Accuses on ABVP National President: పార్కింగ్‌ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై కేసు నమోదయింది. పార్కింగ్ స్థలం వివాదంతో పాటు తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బయ్య షణ్ముగంపై 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య కొద్దిరోజులుగా తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని.. అలాగే కరోనా రక్షణ కోసం వాడే మాస్కులను, కొన్ని ఆకులను తన ఇంటి ముందు వేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సీసీటీవీ ఫుటేజీని ఆమె పోలీసులకు అందజేశారు. ఈ విషయంలో మహిళ బంధువు, బుల్లితెర నటుడు బాలాజీ విజయరాఘవన్‌ మాట్లాడుతూ.. కేసు వివరాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. షణ్ముగం సదరు మహిళ పర్మిషన్‌తో పార్కింగ్‌ స్థలాన్ని వినియోగించుకుంటున్నారని.

ఇందుకు గాను నెలకు 1500 రూపాయల అద్దె‌ చెల్లించాల్సిందిగా ఆమె కండిషన్ పెట్టిందని తెలిపాడు. అయితే ఇటీవల ఈ పార్కింగ్ స్థలం తోపాటు ఆ మహిళ ఇంటి ముందు షణ్ముగం ముందు మూత్ర విసర్జన చేయడం.. వాడేసిన మాస్క్‌లను ఇంటి ముందు పడేయడం చేస్తున్నాడని ఆరోపించారు. అయితే దీనిపై ఎన్నిసార్లు అతనికి చెప్పినా పట్టించుకోలేదని.. దాంతో అతని చర్యలతో విసిగిపోయిన మా ఆంటీ (మహిళ) దీని గురించి అడంబక్కం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కాగా షణ్ముగం ప్రస్తుతం ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. కిల్పాక్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రాయపేట ఆసుపత్రిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్ ఆంకాలజీ హెడ్‌గా పని చేస్తున్నారు.

Raj

Raj

Next Story