పట్టణంలో ఎన్ ఆర్సికి మద్దతుగా బిజెపి ర్యాలీ

పట్టణంలో ఎన్ ఆర్సికి మద్దతుగా బిజెపి ర్యాలీ
x
Highlights

పట్టణంలో భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆత్మకూరు: పట్టణంలో భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భారతీయ పౌరసత్వ బిల్లు యన్ఆర్సికి మద్దతుగా ఈ ర్యాలీ జరిగింది. ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి సోమశిల రోడ్డు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో నియోజకవర్గం బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు, ఏబీవీపీ విద్యార్థి సంఘ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ... వారసత్వ బిల్లుపై వామపక్షాలు, కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఈ బిల్లు వల్ల నిజమైన భారతీయులు ఎవరికీ నష్టం జరగదని అన్నారు. ఓ వర్గం వారు పనిగట్టుకొని దేశంలోని ముస్లింలకు లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదని, దేశంలో చొరబాటు దారులకు తీవ్రవాదులకు మాత్రమే ఇది వర్తిస్తుందని, దీనివల్ల భారత దేశ రక్షణ కలుగుతుందని అన్నారు. ఈ ర్యాలీలో బిజెపిపార్టీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా స్థానిక పార్టీ నాయకులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories