Punjab: పంజాబ్‌ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణస్వీకారం

Punjab: చరణ్‌జిత్ తో ప్రమాణం చేయించిన గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌

Sandeep Eggoju
Updated on: 20 Sept 2021 3:08 PM IST
Charanjit Singh Channi Sworn as Punjab New Chief Minister
X

పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్ జిత్ సింగ్ చన్నీ(ఫైల్ ఇమేజ్)

Punjab: పంజాబ్‌ కొత్త సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చన్నీ నిలిచారు. కాగా, రెండు రోజుల క్రితం సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఆయన ఇవాళ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story