చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం సక్సెస్.. త్వరలో గగన్‌యాన్

చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం సక్సెస్.. త్వరలో గగన్‌యాన్
x
Highlights

చంద్రయాన్ 2 విజయవంత మైన ప్రయోగమని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ వెల్లడించారు. విక్రం తొ సంబంధాలు తెగిపోవడం అనే ఒక్క విషయం తప్పితే అతి ముఖ్యమైన ఆర్బిటార్ లోని 8 సైన్స్ పరికరాలు అద్భుతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నట్టు ఆయన వివరించారు.

చంద్రయాన్-2 విజయవనతమైన ప్రయోగమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే. శివన్ అన్నారు. విక్రం విషయంలో అక్కడి వాతావరణ పరిస్థితుల వాళ్ళ కొద్ది పాటి చిక్కులు ఎదురయ్యాయనీ, అసలు లక్ష్యం ఆర్బిటార్ అద్భుతంగా పనిచేస్తోందని అయన తెలిపారు. భువనేశ్వర్ లో అయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విక్రం తొ సంబంధాలు పునరుద్ధరించలేక పోయినట్లు చెప్పారు. అయితే, ఆర్బిటార్ లో 8 సైన్స్ పరికరాలు ఉన్నాయనీ, అవన్నీ సక్రమంగా తమ లక్ష్యాలను నిర్వర్తిస్తున్నాయనీ తెలిపారు. విక్రం తొ సంబంధాలు తెగిపోయిన విషయంపై దాని కారణాలను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోదిస్తున్నారని చెప్పారు. వారి నివేదిక ఆధారంగా తదుపరి ఏం చేయాలనే అంశంపై దృష్టి పెడతామన్నారు.

మరోవైపు చంద్రుడిపై పగటి సమయం నేటితో ముగిసి రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలుకానుంది. దీంతో విక్రమ్‌ ల్యాండర్‌ కథ ఇక సమాప్తమైనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి విక్రం సూర్యుని వెలుతురుతో తన బ్యాటరీలు చార్జ్ చేసుకుని పని చేస్తుంది. దాంతో పాటు ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తుంది. చంద్రునిపై మన కాలమానంలో 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటాయి. దీని ప్రకారం విక్రం జీవిత కాలం నేటితో ముగిసిపోయినట్టే అని నిపుణులు చెబుతున్నారు.

తదుపరి లక్ష్యం 'మిషన్‌ గగన్‌యాన్‌

ఇస్రో తదుపరి లక్ష్యం 'గగన్‌యాన్‌ మిషన్‌' అని శివన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇస్రో చరిత్రలో మరో ప్రతిష్టాత్మక ప్తాజెక్టు 'గగన్‌యాన్‌. దీని ద్వారా 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. సాయుధ బలగాల్లో ఫ్లయింగ్‌ అనుభవం ఉన్న టెస్ట్‌ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి వారికి తొలుత భారత్‌లో తర్వాత రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్‌ ద్వారా

వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే... స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ ఘనత దక్కించుకోనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories