ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌2!

ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌2!
x
Highlights

ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 మరో వారంలో కొత్త మజేలీకి చేరుకోనుంది. జాబిల్లి కక్ష్యలోకి ఈ నెల 20 న చంద్రయాన్ 2 ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 7 న చంద్రుని మీద అడుగిడుతుంది.

జాబిల్లిని చేరుకోవడానికి ఇస్రో నింగిలోకి పంపించిన చంద్రయాన్ - 2 సరిగ్గా వారం రోజుల్లో చంద్రుని కక్ష్యలోకి చేరనుంది. అనంతరం సెప్టెంబర్ 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. స్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టామనీ, అన్నీ విజయవంతమయ్యాయనీ చెప్పారు. "ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ జరుపుతాం. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ చేపడతాం. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది" అని శివన్‌ వివరించారు.

ప్రస్తుతం వ్యోమనౌక పక్కాగా ఉందని, అన్ని సిస్టమ్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories