TOP 6 NEWS @ 6PM: ఎంతమంది పిల్లలున్నా మే నెల నుండి తల్లికి వందనం - చంద్రబాబు

Budget 2025 Highlights Super Six Schemes, Farmers, Amaravati Development Full Details Inside
x

AP Budget 2025: నేడు ఏపీ బడ్జెట్.. ఆ స్కీములకు భారీగా కేటాయింపులు

Highlights

1) ఎప్ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదాతెలంగాణలో మంగళవారం సాయంత్రం నుండి స్వీకరించాల్సి ఉన్న ఎప్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మరో నాలుగు రోజులు...

1) ఎప్ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా

తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుండి స్వీకరించాల్సి ఉన్న ఎప్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మరో నాలుగు రోజులు వాయిదా పడింది. వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఈ ఎప్ సెట్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున హైదరాబాద్ జేఎన్టీయూ ఈ పరీక్షలను నిర్వహించనుంది.

ఈ ఎంట్రన్స్ పరీక్షల కోసం ఫిబ్రవరి 25 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గతంలో ఎప్ సెట్ పరీక్షల కన్వినర్, డీన్ కుమార్ తెలిపారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ మార్చి 1వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభిస్తామని కుమార్ చెప్పారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిందిగా చెబుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

2) New Ration Cards: మార్చి 1న లక్ష రేషన్ కార్డుల పంపిణీ.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

New Ration Cards: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం అనేక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అయితే మార్చి 1 కొన్ని జిల్లాల్లో మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. మిగతా జిల్లాలకు మార్చి 8 తర్వాత అందించనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం హైదరాబాద్ 285, వికారాబాద్ జిల్లా-22 వేలు, నాగర్ కర్నూల్ జిల్లా 15 వేలు, నారాయణ పేట జిల్లా 12 వేలు, వనపర్తి జిల్లా 6 వేలు, మహబూబ్ నగర్ జిల్లా 13 వేలు, గద్వాల్ జిల్లా 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి 6 వేలు, రంగారెడ్డి జిల్లా 24 వేలు చొప్పున లక్ష కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) వైసీపీ సభ్యుల తీరు చూస్తే ఆ అరాచకాలు గుర్తుకొస్తున్నాయి - పవన్ కళ్యాణ్

ఏపీ శాసన సభలో గవర్నర్ స్పీచ్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైసీపీ శాసన సభ్యులు సభలో ఆందోళన వ్యక్తంచేశారు. సభలో వైసీపీ నేతల తీరును తప్పుపడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా ఉండకూడదన్నారు. గొడవలు, బూతులకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అయిపోయిందన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ సభ్యులు అలా ప్రవర్తించడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు.

గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆయన ప్రసంగాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని, సభలో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తమకు దిశానిర్దేశం చేస్తుంటారని గుర్తుచేసుకున్నారు. కానీ వైసీపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. గవర్నర్ ను వైసీపీ నేతల అవమానించడంలో తమ తప్పేమీ లేకపోయినప్పటికీ ప్రభుత్వం తరపున వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

4) ఎంతమంది పిల్లలున్నా మే నెల నుండి తల్లికి వందనం - చంద్రబాబు

ఏపీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 20 వేల ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా షరతులు లేకుండా వారికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. మే నెల నుండి తల్లికి వందనం అమలవుతుందని తల్లులకు భరోసా ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలు అమలులో జాప్యం జరుగుతోందని వైపీసీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరచుగా పథకాల అమలు ఆలస్యం అవుతుండటానికి గల కారణాలను చెబుతూ వస్తున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి గల్లా పెట్టే ఖాళీ చేసిందని, ఇప్పుడున్న తమ ప్రభుత్వం ఓవైపు ఆ అప్పులకు వడ్డీలు కడుతూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.

5) పెళ్లి చేసుకుంటేనే ఉద్యోగం... లేదంటే తీసేస్తామని కంపెనీ నోటీసులు

ఒక కంపెనీ తమ సంస్థలో పనిచేసే బ్యాచిలర్స్‌కు ఓ వింత షరతు పెట్టింది. అదేంటంటే... ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా తమ సంస్థలో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండకూడదు. 28 ఏళ్ల నుండి 58 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండకుండా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో కొత్త జీవితం ప్రారంభించాలి. లేదంటే వారిని ఉద్యోగంలోంచి తొలగిస్తామని ఆ కంపెనీ స్పష్టంచేసింది. ఆల్రెడీ పెళ్లయిన వారికి ఈ వింత రూల్ వర్తించదు. కానీ పెళ్లి కాని వారికి లేదా పెళ్లయి విడాకులు తీసుకున్న ప్రతీ ఒక్కరికీ ఈ రూల్ వర్తిస్తుందిని ఆ కంపెనీ తేల్చి చెప్పింది.

ఒకవేళ ఈ ఏడాది మార్చి నెల ఆఖరు నాటికి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే.. వారు కంపెనీకి ఒక లెటర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ చివరి నాటికి కూడా వారికి పెళ్లి కాకపోతే... అప్పుడు కంపెనీ వారి పరిస్థితిని సమీక్షించి సెప్టెంబర్ తరువాత వారిని ఉద్యోగంలో కొనసాగించాలా లేక తొలగించాలా అనేది నిర్ణయిస్తుందని ఆ నోటీసుల్లో రాసి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) JIO Airtel: జియో హాట్ స్టార్ ను ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతున్న టాటా ఎయిర్ టెల్

JIO Airtel: ముఖేష్ అంబానీకి చెందిన జియో హాట్‌స్టార్ భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం ద్వారా ఏర్పడిన ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం మూడు లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో విస్తరించడమే కాకుండా, భారతదేశంలో అత్యధిక కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ జియో హాట్‌స్టార్‌కు పోటీగా ఎయిర్‌టెల్, టాటా గ్రూప్‌లతో కలిసి ఓ ప్రణాళికను తయారుచేసుకుంటోంది.

ఎయిర్‌టెల్, టాటా ప్లే (DTH సేవ) ని విలీనం చేసి పెద్ద డిజిటల్ టీవీ, ఓటీటీ సేవలను అందించడానికి యోచిస్తోంది. ఈ విలీనం ద్వారా టాటా ఎయిర్‌టెల్ కలిసి 35 మిలియన్ల పెయిడ్ కస్టమర్లను కలిగి ఉన్న డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories