JIO Airtel: జియో హాట్ స్టార్ ను ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతున్న టాటా ఎయిర్ టెల్

JIO Airtel: జియో హాట్ స్టార్ ను ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతున్న టాటా ఎయిర్ టెల్
x

JIO Airtel: జియో హాట్ స్టార్ ను ఎదుర్కొనేందుకు చేతులు కలుపుతున్న టాటా ఎయిర్ టెల్

Highlights

JIO Airtel: ముఖేష్ అంబానీకి చెందిన జియో హాట్‌స్టార్ భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది.

JIO Airtel: ముఖేష్ అంబానీకి చెందిన జియో హాట్‌స్టార్ భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం ద్వారా ఏర్పడిన ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం మూడు లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో విస్తరించడమే కాకుండా, భారతదేశంలో అత్యధిక కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ జియో హాట్‌స్టార్‌కు పోటీగా ఎయిర్‌టెల్, టాటా గ్రూప్‌లతో కలిసి ఓ ప్రణాళికను తయారుచేసుకుంటోంది. ఎయిర్‌టెల్, టాటా ప్లే (DTH సేవ) ని విలీనం చేసి పెద్ద డిజిటల్ టీవీ, ఓటీటీ సేవలను అందించడానికి యోచిస్తోంది. ఈ విలీనం ద్వారా టాటా ఎయిర్‌టెల్ కలిసి 35 మిలియన్ల పెయిడ్ కస్టమర్లను కలిగి ఉన్న డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ విలీనం ద్వారా టాటా ప్లే, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీతో కలిసి దేశంలోని అతిపెద్ద డీటీహెచ్ సర్వీస్‌ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. టాటా ప్లే 19 మిలియన్ల ఇళ్లకు సేవలను అందిస్తుంది, దీనిని ఎయిర్‌టెల్ చేత అధికంగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ డీటీహెచ్ మార్కెట్లో అగ్రగామిగా ఉంది. దాంతో పాటు టెలికాం, బ్రాడ్‌బ్యాండ్, DTH సేవలను కలిపి బహుళ సేవలను అందించే సామర్థ్యంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడుతుంది.

ఇది 2016లో డిష్ టీవీ-వీడియోకాన్ D2H తర్వాత DTH రంగంలో జరిగిన రెండవ అతిపెద్ద విలీనం. ఇదిలా ఉంటే, టాటా ప్లే, వాల్ట్ డిస్నీతో సహా 45-48శాతం వాటాను కలిగి ఉండనుంది. కాగా ఎయిర్‌టెల్ 52-55శాతం వాటాను కలిగి ఉంటుంది. ఈ విలీనం తర్వాత రెండు సంస్థలు మార్కెట్‌లో మ్యాజిక్ వాటాను దక్కించుకోవచ్చు. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్ ఈ సంస్థను సీనియర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 2024 నాటికి ఈ రెండు సంస్థలు దాదాపు 7,000 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories