ఢిల్లీలో అమిత్‌ షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ

Delhi: టీడీపీ - జనసేన - బీజేపీ మధ్య పొత్తులపై కుదిరిన ఒప్పందం

Jyothi
Published on: 8 March 2024 11:09 AM IST
Chandrababu and Pawan meet Amit Shah in Delhi
X

ఢిల్లీలో అమిత్‌ షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ

Delhi: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పొత్తుల లెక్క దాదాపు తేలిపోయింది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు భేటీ అయ్యారు. సీట్ల సర్ధుబాటుపై అమిత్‌ షా, చంద్రబాబు, జనసేనానిలు చర్చించారు. అమిత్‌ షాతో దాదాపు గంటన్నరకు పైగా సమావేశం జరిగింది. సీట్ల సర్ధుబాటుపై టీడీపీ-జనసేన-బీజేపీలు ఒక అవగాహనకు వచ్చాయి.

బీజేపీకి శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్‌, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టు సమాచారం. అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, రాజంపేట, తిరుపతి, లోక్‌సభ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకారించినట్టు తెలుస్తోంది. కాగా పొత్తుల్లో సీట్ల సర్ధుబాటుపై ఈరోజు టీడీపీ- జనసేన -బీజేపీ జాయింట్ ప్రెస్‌మీట్‌ ఉండే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story