కరోనా వ్యాక్సిన్ : నకిలీ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం

కరోనా వ్యాక్సిన్ :  నకిలీ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
x
Highlights

కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫైజర్, మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ఓకే చెప్పగా.. మన దగ్గర కూడా మహమ్మారితో పోరులో కేంద్రం కీలక అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్ కేంద్రం త్వరలోనే పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం కొవిన్ (Co-WIN) పేరుతో యాప్ తీసుకురానుంది. అయితే, తాము తీసుకురాదలిచిన యాప్ తరహాలోనే కొన్ని నకిలీలు యాప్ స్టోర్లలో దర్శనమిస్తుండడం పట్ల కేంద్రం స్పందించింది. తాము ఇంకా అధికారిక యాప్ తీసుకురాలేదని, నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కొవిన్ అని ధ్వనించేలా కొన్ని నకిలీ యాప్ లను మోసపూరిత శక్తులు రూపొందించాయని, వాటిని చూసి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ నకిలీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని, వాటిలో తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేసింది. అధికారిక యాప్ త్వరలోనే ఆవిష్కరిస్తామని, దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డ్రైరన్ పూర్తవగా.. త్వరలో వ్యాక్సిన్‌ పంపిణీ కూడా షురూ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories