logo

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం!

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం!
Highlights

ఆకాశాన్నంటుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ...

ఆకాశాన్నంటుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.లైవ్ టీవి


Share it
Top