కాశ్మీర్ బిల్లు ప్రవేశ పెట్టడానికి కేంద్రం ముందస్తు చర్యలు ఇవీ..

కాశ్మీర్ బిల్లు ప్రవేశ పెట్టడానికి కేంద్రం ముందస్తు చర్యలు ఇవీ..
x
Highlights

కేంద్రం అనుకున్నది చేసింది. కచ్చితంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఎప్పుడేం చేయాలో ప్రణాళిక వేసుకుని సరిగ్గా తననుకున్నది సాధించింది. కాశ్మీర్...

కేంద్రం అనుకున్నది చేసింది. కచ్చితంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఎప్పుడేం చేయాలో ప్రణాళిక వేసుకుని సరిగ్గా తననుకున్నది సాధించింది. కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. గత పదిహేను రోజులుగా ఒక్కొక్క చర్యనూ బిల్లును ప్రతిపాదించే దారిలో నడిపిస్తూ.. ఎక్కడా తడబాటు లేకుండా.. ముఖ్యంగా ప్రతిపక్షాలకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కాశ్మీర్ విషయంలో సాహసం చేసింది. ఈ సాహసం వెనుక చాలా ప్రణాళిక ఉంది. అది ఏమిటో.. దీనికోసం తీసుకున్న చర్యలేమిటో ఒకసారి చూడండి..

- ఉగ్ర దాడుల సమాచారం ఉందనే నెపంతో పదివేల మంది సైనికుల్ని కాశ్మీర్ లోయకు తరలించింది.

- ఆర్టికల్ 35ఎ రద్దుపై ఊహాగానాలు కాశ్మీర్ లో ఊపందుకుంటున్న సమయంలో రాష్ట్రంలోని మసీదులు, వాటి మేనేజ్‌మెంట్‌ కమిటీలపై పోలీసులు వివరాలు తీసుకున్నారు. దీంతో అక్కడి రాజకీయ పక్షాలు ఇటువంటి నిర్ణయాల్ని కాశ్మీర్ ప్రజలు ఆమోదించారంటూ ఆక్రోశించాయి.

- ఈ నేపథ్యంలో అదంతా వదంతులనీ, కేవలం ఉగ్రదాడులను ఎదుర్కునేందుకే బలగాల మోహరింపు చేస్తున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటన చేశారు.

- మొహబూబా ముఫ్తీ ఆర్టికల్ 35ఎ పై అవగాహనా కార్యక్రమాలు మొదలు పెట్టారు. దానికి కేంద్రం ప్రజలను భయాన్దోలనకు గురి చేయొద్దంటూ ప్రకటన చేసింది.

- 25 వేల మంది సైనికుల్ని కాశ్మీర్ లో మొహరించినట్టు వార్తలు వచ్చాయి. ఎదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడ్డాయి.

- కాశ్మీర్లో ఏం జరుగుతుందో తెలపాలని ప్రధాన పార్టీల నేతలు చేసిన విజ్ఞప్తికి స్పందనగా 35ఏ రద్దుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఉగ్రదాడి నేపథ్యంలోనే బలగాల మొహరింపు అని చెప్పారు గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌.

- అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితులు అంచనా వేసుకున్నారు. అర్థరాత్రి కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.

- సోమవారం రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన బిల్లులు ప్రవేశ పెట్టారు. వెంటనే రాష్ట్రపతి కోవింద్ ఆర్టికల్ 370 రద్దు పై ఆర్డినెన్స్ విడుదల చేశారు. దీంతో జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర స్వయంప్రతిపత్తి రద్దయింది. అలాగే రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌ని చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్‌ను చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories