Central Cabinet: కోవిడ్‌పై యుద్ధానికి కేంద్రం వైద్య ప్యాకేజీ ప్రకటన

Central Cabinet Announced the Emergency Covid Fund
x

కేంద్ర కాబినెట్ ఎమర్జెన్సీ కోవిడ్ నిధులు ప్రకటన (ఫైల్ ఇమేజ్)

Highlights

Central Cabinet: ఎమర్జెన్సీ కోవిడ్ ఫండ్ కింద రాష్ట్రాలకు 23వేల కోట్లు

Central Cabinet: కొత్త కేబినెట్‌ తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. థర్డ్‌వేవ్‌ వస్తే.. తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రచించింది. గతంలో జరిగిన లోటుపాట్లపై దృష్టిసారించింది. ఏకంగా 23వేల 132కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రాల వాటాను డిసైడ్‌ చేసింది.

కొత్త కేబినెట్‌ నియామకం చకచక జరిగిపోయింది. పైగా అదే స్పీడ్‌లో భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాత్రికి రాత్రే శాఖలు ఫిక్స్ చేశారు ప్రధానమంత్రి మోడీ. సింగిల్‌ డే వేస్ట్‌ చేయకుండా ఇవాళ కేంద్ర కొత్త మంత్రివర్గం మొదటి సమావేశాన్ని పూర్తి చేసుకుంది.

కరోనా తాజా పరిస్థితులు, థర్డ్‌ వేవ్‌ ఎదుర్కోవడం ఎలా అనే అంశాలపై కేంద్ర కేబినెట్‌ చర్చించింది. అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద 23వేల 132 కోట్ల ఫండ్‌ను ప్రకటించింది. ఆ మొత్తంలో 15వేల కోట్ల నిధులను కేంద్రం ఖర్చు చేయనుంది. మరో 8వేల కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. రానున్న 9 నెలల్లో ఈ ప్యాకేజీని అమలు చేస్తామన్నారు.

మరోవైపు థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోనేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. 736 జిల్లాల్లో పీడియాట్రిక్స్ విభాగాలు, 20వేల కొత్త ఐసీయూ పడకలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 20 శాతం బెడ్స్‌ పిల్లల కోసం కేటాయించనున్నారు.

ఇక, నూతన సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి తోమర్ స్పష్టం చేశారు. సాగు చట్టాల వల్ల మండీలకు వచ్చే నష్టమేమీ లేదని వివరించారు. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే తాము కొకొనట్ బోర్డు యాక్ట్‌‌ను సవర్తిస్తున్నామని తోమర్‌ చెప్పుకచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories