CBSE Exams: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

CBSE Exams: త్వరలో తేదీలు ప్రకటించనున్న కేంద్ర విద్యాశాఖ * కేంద్ర మంత్రి రమేశ్ పో‌ఖ్రియాల్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో

Sandeep Eggoju
Published on: 23 May 2021 6:43 PM IST
CBSE Green Signal to 12 Class Exams
X
సీబీఎస్ఈ ఎగ్జామ్స్ (ఫైల్ ఇమేజ్)

CBSE Exams: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర విద్యాశాఖ. ఇవాళ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకే మెజారిటీ రాష్ట్రాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు వాయిదా వేయాలని కోరినా పరీక్షల నిర్వహణకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈనెల 27 వరకు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కోరారు. ఆ తర్వాత పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story