సిబిఎస్‌ఈ పరీక్షలపై నేడు తుది నిర్ణయం?

సిబిఎస్‌ఈ పరీక్షలపై నేడు తుది నిర్ణయం?
x
Highlights

మిగిలిన సిబిఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

మిగిలిన సిబిఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది, దీనిపై మధ్యాహ్నం 2 గంటల తరువాత తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు సోమవారం జరిగిన విచారణలో,దీనికోసం కోర్టు నుండి రెండు రోజుల సమయం కోరింది బోర్డ్. దాంతో సుప్రీం కోర్టు విచారణను 25 జూన్ 2020 వరకు వాయిదా వేసింది. ఈ క్రమంలో సిబిఎస్‌ఈ బోర్డు తన అభిప్రాయాన్ని ఈ రోజు కోర్టు ముందుంచింది.

ఒకవేళ పరీక్షలు రద్దు అనివార్యం అయితే, బోర్డు ప్రత్యేక మార్కింగ్ పద్ధతి ఆధారంగా విద్యార్థులకు ఉత్తీర్ణత ఇచ్చే అవకాశం ఉంది. కాగా దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జూలై 1 నుంచి జూలై 15 వరకు సిబిఎస్‌ఈ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని వర్గాలు తెలిపాయి. అయితే ఇంకా ఆలస్యం జరిగితే విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇబ్బంది అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఈ కారణం చేత పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల బృందం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ఇది విన్న కోర్టు పరీక్షను రద్దు చేయడాన్ని పరిశీలించాలని బోర్డును కోరింది. మరోవైపు కరోనా ఉదృతి పరిస్థితుల దృష్ట్యా, జెఇఇ (మెయిన్), జెఇఇ (అడ్వాన్స్డ్) మరియు నీట్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ కూడా ఉంది. అయితే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం జాతీయ ప్రవేశ పరీక్షలు జెఇఇ (మెయిన్), జెఇఇ (అడ్వాన్స్డ్) నీట్ వంటివి రద్దు చేయబడని.. కాకుంటే ఈ పరీక్షలను మరికొంతకాలం వాయిదా వేసుకోవచ్చని అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories