మనీష్ సిసోడియాను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ

Jyothi
Published on: 27 Feb 2023 9:01 AM IST
CBI to Produce Manish Sisodia in Court Today
X

మనీష్ సిసోడియాను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ

Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించి, ఆ తర్వాత అరెస్టు చేసింది. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణలో పలు కీలక అంశాలకు సంబంధించి ఆయన చెప్పిన సమాధానాల్లో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని అధికారులు చెప్తున్నారు. కాగా, అంతకుముందు సిసోడియా సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను పెంచారు. సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీబీఐ ఆఫీసుతో పాటు సిసోడియా నివాసం వద్ద స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను మోహరించారు. సిసోడియా అరెస్టును పలు పార్టీలు ఖండించాయి.

Jyothi

Jyothi

Next Story