DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌పై కేసు

DK Shivakumar: బీజేపీ నేతల ఫోటో మార్ఫ్ చేసిన కేసులో కోర్టు ఆదేశం

Jyothi
Updated on: 8 Feb 2024 9:15 AM IST
Case against Karnataka Deputy CM DK Shivakumar
X

DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌పై కేసు

DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఆయనతో పాటు కాంగ్రెస్ ఐటీ సెల్‌కు నేతృత్వం వహిస్తున్న బీఆర్ నాయుడుపై కూడా కేసు నమోదు చేయాలని తెలిపింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇటీవల హుబ్బళ్లికి చెందిన ఓ కరసేవకుడిని అరెస్ట్ చేయగా.. పలువురు బీజేపీ నేతలు నిరసన తెలిపారు.

తాము కూడా కరసేవకులమే అని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ ప్లకార్డుల ఫోటోలను మార్ఫ్ చేసి తాము కుంభకోణాలు చేశామని.. అరెస్ట్ చేయాలనే నినాదాన్ని ఉంచారు. దీనిని కాంగ్రెస్‌ సోషల్ వింగ్ పోస్టు చేయడంతో బీజేపీ పిల్ దాఖలు చేసింది. దీంతో న్యాయస్థానం క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story