Amarinder Singh: కొత్త పార్టీ పేరు ప్రకటించిన అమరీందర్ సింగ్

Amarinder Singh: రాజీనామా లేఖను సోనియాకు పంపిన కెప్టెన్

Sandeep Eggoju
Published on: 2 Nov 2021 9:24 PM IST
Captain Amarinder Singh Announced His Party Name as Punjab Lok Congress
X

కొత్త పార్టీ పేరును ప్రకటించిన పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ (ఫైల్ ఇమేజ్)

Amarinder Singh: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారయ్యింది. తన పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్‌గా కెప్టెన్ అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. రాజీనామా లేఖలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించినా సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా మీరు నియమించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ భజ్వాను సిద్ధూ బహిరంగంగా ఆలింగనం చేసుకున్నారని మండిపడ్డారు. పంజాబ్ రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో కెప్టెన్ స్పష్టంచేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story