Brij Bhushan: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు.. రద్దు చేసిన ఢిల్లీ పోలీసులు

Brij Bhushan: పోక్సో కేసు రద్దు పిటిషన్‌ను కోర్టుకు సమర్పించిన పోలీసులు

Dhatripriya
Published on: 15 Jun 2023 12:40 PM IST
Cancel POCSO Case Filed By Minor Against Brij Bhushan
X

Brij Bhushan: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు.. రద్దు చేసిన ఢిల్లీ పోలీసులు

Brij Bhushan: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలైంది. రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న ఢిల్లీ పోలీసులు అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌‌ కోర్టులో బ్రిజ్ భూషణ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 550 పేజీలతో ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల రెజ్లర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జూన్ 15లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హామీ మేరకు ఇవాళ ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును రద్దు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆధారాలు లేకపోవడంతో.. పోక్సో కేసు రద్దు పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story