మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు

admin1
Updated on: 24 Nov 2019 5:35 PM IST
మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు
X

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలకు తెరలేచింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు స్టార్ హోటళ్లకు తరలించాయి. ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో బీజేపీకి దొరక్కుండా ఉండేందుకు ఆ మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను స్టార్ హోటళ్లలో ఉంచి కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను జుహూ ఏరియాలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు, శివసేన ఎమ్మెల్యేలను ఎయిర్ పోర్టు సమీపంలోని లలిత్ హోటల్‌కు, ఎన్సీపీ ఎమ్మెల్యేలను రెనాసెన్స్ హోటల్‌కు తరలించారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




admin1

admin1

Next Story