logo

హారను కొడితే ఆ ఎద్దుకు మండింది.. కొమ్ములతో కుమ్మేసింది!

హారను కొడితే ఆ ఎద్దుకు మండింది.. కొమ్ములతో కుమ్మేసింది!Images from amit alok twitter
Highlights

ట్రాఫిక్ లో మన వెనుక ఎవరన్నా ఊరికే ఆగకుండా హారన్ కొడితే ఎక్కడో కాలుతుంది. అయితే, ఏమీ చేయలేక మనం గమ్మున ఉంటాం లోపల్లోపల తిట్టుకుంటూ..

ట్రాఫిక్ లో మన వెనుక ఎవరన్నా ఊరికే ఆగకుండా హారన్ కొడితే ఎక్కడో కాలుతుంది. అయితే, ఏమీ చేయలేక మనం గమ్మున ఉంటాం లోపల్లోపల తిట్టుకుంటూ. కానీ అది ఎద్దు.. అసలే అప్పటికే దానికి ఏమైందో మరి.. రోడ్డుమీద వెళుతుంటే ఓ కారు డ్రైవర్ దాన్ని తప్పుకోమని హారన్ కొట్టాడు. ఇంకేముంది దానికి మరింత మంట ఎక్కినట్టుంది. ఇక ఒక్కసారిగా వెనక్కితిరిగి కారును కుమ్మడం మొదలు పెట్టింది. కుమ్మడం అంటే అలా ఇలా కాదు.. కొమ్ములతో దాదాపు ఆ కారు తిరగబడిపోయే స్థితికి వెళ్లేట్టుగా కుమ్మేసింది. ఈ లోపు అక్కడి జనాలు చూసి పరిగెత్తుకొచ్చి ఆ ఎద్దును శాంతింపచేశారు.

బీహార్‌లోని హాజీపూర్‌ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న కారు హారను మోతకి ఆ ఎద్దు అలా ప్రవర్తించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. అమిత్ అలోక్ అనే ఆయన ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే.. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. మీరూ ఆ వీడియో చూసేయండి మరి!




లైవ్ టీవి


Share it
Top