Mumbai: ముంబైలో బోనాల పండుగ సందడి..

Bonalu In Mumbai
x

Mumbai: ముంబైలో బోనాల పండుగ సందడి.. 

Highlights

Mumbai: AK తెలుగు మీడియా సంయుక్త ఆధ్వర్యంలో బోనాల పండుగ

Mumbai: ముంబైలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ అఫ్ తెలుగు అసోసియేషన్స్ అఫ్ మహారాష్ట్ర, ఎఫ్ - టామ్ ఎబెల్ ఎడ్యుకేషన్ & కల్చరల్ అసోసియేషన్, AK తెలుగు మీడియా సంయుక్త ఆధ్వర్యమున బోనాల పండుగ అంటోఫిల్ సైన్ ముత్తు మరియమ్మ దేవాలయంలో జరిగింది.

తెలుగు ప్రజలు వివిధ ప్రాంతము నుండి డప్పు వాయిద్యాలతో మహిళలు బోనాలు తీసుకొచ్చారు. సుమారు 150 బోనాలు, మహిళా సంస్థలు, తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. తెలంగాణలో జరిగే విధంగానే ముంబైలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్ సూర్య తేజా, ఆభినేత్రి చైత్ర, ఊర్వశి, బోనాలతో పాల్గొన్నారు., తెలుగు వారు ఐక్యతతో సంస్కృతిని కాపాడుకోవాల ఎఫ్ - టామ్ అధ్యక్షుడు గంజి జగన్ బాబు కోరారు.

తెలుగు వారు ఐక్యతతో సంస్కృతిని కాపాడుకోవాల ఎఫ్ - టామ్ అధ్యక్షుడు గంజి జగన్ బాబు కోరారు.

అందరికి స్వాగతము పలికారు, అలాగే ప్రతి తెలుగు వారి పండుగ పెద్ద ఎత్తున చేసి, తెలుగు వారి ఐక్యత మరియు సంస్కృతిని కాపాడుకోవాలి అని కోరినారు, అందరు ఎఫ్ - టామ్ ఉచిత మెంబర్ షిప్ తీసుకోవాలని అవ్వహనము ఇచ్చారు

ఎఫ్ - టామ్ ప్రధాన కార్యదర్శి అశోక్ కంటే, బోనాల పండుగ, మరియు ప్రాముఖ్యత గురించి వివరించారు, అలాగే అందరి మహిళలకు మార్గదర్శనము చేశారు. అనురాధ బింగి, చీలివెరి చంద్రకాంత్, రాజు రావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రవీణ్ వేముల, రాకేష్ మండల, అమర్ దూస, సంగీత మద్రాల్ల, నిర్మల పెంట, బి లక్ష్మి, గీత వడ్లకొండ చాల కృషి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories