Tamilnadu: సీఎం నివాసానికి, సచివాలయనికి బాంబు బెదిరింపు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి, సచివాలయానికి బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది.

Samba Siva Rao
Updated on: 3 Jun 2020 12:09 PM IST
Tamilnadu: సీఎం నివాసానికి, సచివాలయనికి బాంబు బెదిరింపు
X

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి, సచివాలయానికి బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో సచివాలయం ఉన్న విషయం తెలిసిందే. సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబులతో పీల్చుతామని ఆగంతకుడు బెదిరింపు కాల్ చేశాడు. బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ మంగళవారం వచ్చిన బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆదీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం సైబర్‌ క్రైం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో తరచూ సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో బాంబు పెట్టినట్టు ఆగంతకులు ఫోన్‌లో చెప్పాడు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Samba Siva Rao

Samba Siva Rao

Next Story