BJP: నేటితో ముగియనున్న బీజేపీ జాతీయ సమావేశాలు

BJP: తొలిరోజు రాజకీయ, ఆర్ధిక, సామాజిక తీర్మానాలపై చర్చ

Jyothi
Published on: 18 Feb 2024 12:29 PM IST
BJP National Meeting will end today
X

BJP: నేటితో ముగియనున్న బీజేపీ జాతీయ సమావేశాలు 

BJP: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బీజేపీ జాతీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల జాతీయ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. తొలిరోజు ఆర్థిక, రాజకీయ, సామాజిక తీర్మానాలపై చర్చ జరగగా.. ‎ఇవాళ ప్రధాని ప్రసంగంతో సమావేశాలు ముగియనున్నాయి.

మొత్తం 11 వేల 500 మంది బీజేపీ ప్రతినిధులకు ఆహ్వానం అందగా.. అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సమావేశాలకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని ప్రసంగించనుండగా.. ఆయన ప్రస్తావించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో బిజేపి కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేయనున్న ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు బిజేపి ఇచ్చే సరికొత్త హామీలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. బిజేపి ముందున్న సవాళ్ళు, బాధ్యతలను తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు ప్రధాని మోడి.

Jyothi

Jyothi

Next Story