మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి బీజేపీ కీలక బాధ్యతలు

* జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా జితేందర్‌రెడ్డి * దుబ్బాకలో బీజేపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన జితేందర్‌రెడ్డి * స్టార్‌ క్యాంపయినర్‌ రేసులో ఎంపీ అరవింద్‌ పేరు

admin
Updated on: 27 Dec 2020 11:18 AM IST
మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి బీజేపీ కీలక బాధ్యతలు
X

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా జితేందర్‌రెడ్డిని నియమించారు. స్టార్‌ క్యాంపయినర్‌గా ఎంపీ అరవింద్‌ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపు మీదున్న కమలం పార్టీ.. ప్రతి ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.

admin

admin

Next Story