Goa Governor Bhagat Singh Koshyari: గోవా గ‌వ‌ర్న‌ర్‌గా భగత్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణం స్వీకారం

Goa Governor Bhagat Singh Koshyari: గోవా నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి చేత హైకోర్టు ప్ర‌ధాన జ‌స్టిస్ దిప‌న్‌క‌ర్ ద‌త్తా ప్ర‌మాణం చేయించారు.

Karampoori Rajesh
Published on: 19 Aug 2020 7:57 PM IST
Goa Governor Bhagat Singh Koshyari: గోవా గ‌వ‌ర్న‌ర్‌గా భగత్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణం స్వీకారం
X
గోవా గ‌వ‌ర్న‌ర్‌గా భగత్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణం స్వీకారం

Goa Governor Bhagat Singh Koshyari: గోవా నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి చేత హైకోర్టు ప్ర‌ధాన జ‌స్టిస్ దిప‌న్‌క‌ర్ ద‌త్తా ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప‌నాజీకి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ కోశ్యారికి సీఎం ప్ర‌మోద్ ద‌బోలిం ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.గోవా గ‌వ‌ర్న‌ర్‌గా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గ‌మ‌న‌ర్హం.

అలాగే ..గోవా గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్‌ను మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ గా బ‌దిలీ చేస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story