కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్‌

Arun Chilukuri
Updated on: 1 May 2020 12:43 PM IST
కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్‌
X

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా కార్మికులకు గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడే శుభాకాంక్షలు తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం భ‌రోసా నిచ్చారు. యావత్ సమాజం కార్మిక లోకానికి అండగా నిలవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. మేడే సందర్భంగా కార్మికులు బయటకు రాకుండానే ఉత్సవాలు జరుపుకోవాలని ముఖ్య‌మంత్రి సూచించారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం. కార్మికులంతా ఆరోగ్యం, సంపదతో బాగుండాలని ప్రార్థిస్తున్నా. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించి కరోనాపై విజయం సాధించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story