MK Stalin: స్టాలిన్‌ ట్విటర్ ‌పేజీలు మార్పులు

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, తాను ద్రవిడ సమూహానికి చెందిన వాడినని ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు.

Arun Chilukuri
Updated on: 11 May 2021 4:05 PM IST
Belongs to Dravidian, says MK Stalin
X

MK Stalin: స్టాలిన్‌ ట్విటర్ ‌పేజీలు మార్పులు

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, తాను ద్రవిడ సమూహానికి చెందిన వాడినని ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. అనేక దశాబ్దాల నిరీక్షణ తర్వాత స్టాలిన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది క్షణాల్లోనే ఆయన ట్విట్టర్‌ పేజీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు అనే వ్యాఖ్యలతో పాటు ద్రావిడ సమూహానికి చెందిన వాడిని అనే వ్యాఖ్యలు తాజాగా చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలో 50 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకే ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు చోటు లేదని ప్రజలు అనేకసార్లు స్పష్టం చేశారు. 1962లో పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై.. తాను ద్రావిడ సమూహానికి చెందిన వాడినని ప్రసంగాన్నిముగించారు. ఇప్పుడు స్టాలిన్‌ ట్విట్టర్‌ అక్కౌంట్‌లో మార్పులకు అన్నాదురై స్పూర్తి కారణమనే అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story