Bandi Sanjay: రేపో మాపో ఢిల్లీకి బండి సంజయ్‌

Bandi Sanjay: తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టడంపై అధిష్టానం దృష్టి

Dhatripriya
Published on: 16 May 2023 6:20 PM IST
Bandi Sanjay Tour To Delhi
X

Bandi Sanjay: రేపో మాపో ఢిల్లీకి బండి సంజయ్‌

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది ఆ పార్టీ అధిష్టానం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేడర్‌ను సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రేపో మాపో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటికే సీనియర్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. బండి సంజయ్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక కర్ణాటక ఎన్నికల ప్రభావంతో తెలంగాణలో బీజేపీ కేడర్ నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పరిస్థితి చేయి దాటకముందే గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా.. కేడర్‌ను సిద్ధం చేయాలనే నిర్ణయం తీసుకుంది.

Dhatripriya

Dhatripriya

Next Story