బేక‌రీ ఓన‌ర్‌కు క‌రోనా.. 300 మందికి ప‌రీక్ష‌లు..!

కేరళలో బేకరీ యజమానికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

Raj
By Raj
Updated on: 17 May 2020 12:52 PM IST
బేక‌రీ ఓన‌ర్‌కు క‌రోనా.. 300 మందికి ప‌రీక్ష‌లు..!
X
Representational Image

కేరళలో బేకరీ యజమానికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో అతనితో సంబాషించిన వందలాది మందికి టెస్టులు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఇడుక్కి జిల్లాలోని కరుణపురంలో ఘటన చోటుచేసుకుంది. బేకరీ యజమాని విషయంలో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది, అతనితో సంభాషించిన 300 మందిని అధికారులు ఇప్పటికే గుర్తించారు.

తుది జాబితా ఇంకా సిద్ధంగా లేదు, అతనితో దాదాపు 300 మందితో సంప్రదింపులు జరిపినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.. ప్రస్తుతం అత‌డిని తోడుపుఝ‌‌ ఆసుప‌త్రికి త‌ర‌లించి ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తుండ‌గా ఆయ‌న కుటుంబాన్ని క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. కాగా అతడిలో వ్యాధి ల‌క్ష‌ణాలు మాత్రం కనిపించలేదు. అతని ప్రయాణ చరిత్ర దృష్ట్యా కరోనా టెస్టు చేశారు.


Raj

Raj

Next Story