కరోనాకు మందు ఈ రోజే రిలీజ్ చేయనున్న రాందేవ్ బాబా !

Samba Siva Rao
Updated on: 23 Jun 2020 11:35 AM IST
కరోనాకు మందు ఈ రోజే రిలీజ్ చేయనున్న రాందేవ్ బాబా !
X
Baba Ramdev (File Photo)

కరోనా వైరస్ కు చెక్ పెట్టే ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు యోగా గురువు బాబా రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి, ఆయుర్వేద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు పతంజలి యోగ్‌పీట్ సీఈఓ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ) ఆచార్య బాలకృష్ణ ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా చికిత్సకు ఆయుర్వేద ఔషధం కరోనైల్(Coronil) హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీట్ లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు.

కరోనిల్ గురించి పూర్తి శాస్త్రీయ వివరాలు కూడా పంచుకోనున్నట్లు తెలిపారు. కరోనాకు చెక్ చెప్పేందుకు మొదటి ఆయుర్వేద ఆధారిత ఆయుర్వేద ఔషధం తామే రూపొందించినట్లు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో బాబా రామ్‌దేవ్ కూడా హాజరుకానున్నరని ట్వీట్ చేశారు.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story