ఆత్మ నిర్భర్‌ భారత్‌ : రైతులకు భారీ ఊరట.. వలస కార్మికులకు బాసట!

ఆత్మ నిర్భర్‌ భారత్‌ : రైతులకు భారీ ఊరట.. వలస కార్మికులకు బాసట!
x
nirmala sitharaman press meet
Highlights

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈరోజు మరిన్ని రంగాలకు ఇచ్చే వేసులుబాట్లను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటించారు.

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈరోజు మరిన్ని రంగాలకు ఇచ్చే వేసులుబాట్లను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటించారు.

రైతులకు ఊరట..

వ్యవసాయ రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకిటించారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తామని ఆమె తెలిపారు. రైతుల కోసం ఆర్ధిక మంత్రి ప్రకటించిన వివిధ పతకాలు ఇవే..

- సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారు. అదేవిధంగా కిసాన్‌ కార్డుదారులకు ₹25 వేల కోట్లు రుణాలు మంజూరు చేస్తారు.

- రెండున్నర కోట్లమందికి రూ. రెండు లక్షల కోట్ల అదనపు రుణాలు ఇస్తారు. కిసాన్‌ క్రెడిట్‌ లేని రెండున్నర కోట్ల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.

- పశుపోషకులు, మత్స్యకారులకు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తారు.

వలస కార్మికులకు బాసటగా...

నిర్మల సీతరామన్ వలస కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించారు. దీని ప్రకారం..

- ఇప్పటికే సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు ₹11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించారు.

- వలస కార్మికులకు నగదు పంపిణీ చేశామనీ, వలస కార్మికులకు రోజుకు మూడు పూటలా అన్నపానీయాలు అందించడానికి కృషి చేస్తున్నామనీ ఆర్ధిక మంత్రి చెప్పారు. ఇందుకోసం పట్టణ స్వయం సహాయక సంఘాలకు ₹12 వేల కోట్లు ఇప్పటికే అందించామన్నారు.

- వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పని దినాలు కల్పించామని వివరించారు.

- పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించినట్టు చెప్పారు.

- వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉపాధి పొండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

- దేశమంతా ఒకటే కనీస వేతనం ఉండేలా చూస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

- వలస కార్మికులు అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించారు.

- వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తారు.

- సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకునేలా వెసులుబాటు ఇచ్చారు.

-10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనున్నారు.

- ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు ₹11,0002 కోట్లు ఇప్పటికే అందించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories