ఢిల్లీలో వేడెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

- కేజ్రీవాల్ రోడ్ షోలు...అమిత్ షా ర్యాలీలు...

admin1
Published on: 27 Jan 2020 8:56 PM IST
ఢిల్లీలో వేడెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
X
Kejriwal , Amit Shah File Photo

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కేజ్రీవాల్ రోడ్ షోలు..అమిత్ షా ర్యాలీలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం నరేలా, బవానా, గాంధీనగర్ ప్రాంతాల్లో రోడ్ షోలలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఆప్ కు పోటీగా బీజేపీకి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. అమిత్ షా తన ప్రసంగంలో కేజ్రీవాల్, రాహుల్ గాంధీలపై విమర్శల వర్షం కురిపించారు.

admin1

admin1

Next Story