కరోనా కంట్రోల్ అవుతుంది.. ఆశలు రేకెత్తిస్తున్న అంచనాలు!

కరోనా మహామ్మరితో వ్యవస్థలు స్తంభించిపోయాయి. లక్దౌన్ ఎప్పటి వరకూ కొనసాగుతుందో అర్ధంకాని పరిస్తితిలో దేశ ప్రజలు ఉన్నారు. ఈ సమయంలో టైమ్స్ నౌ ఇండియా అవుట్ బ్రేక్ అంచనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.

K V D Varma
Updated on: 29 April 2020 10:52 AM IST
కరోనా కంట్రోల్ అవుతుంది.. ఆశలు రేకెత్తిస్తున్న అంచనాలు!
X
Representational Image

కరోనా మహామ్మరితో వ్యవస్థలు స్తంభించిపోయాయి. లక్దౌన్ ఎప్పటి వరకూ కొనసాగుతుందో అర్ధంకాని పరిస్తితిలో దేశ ప్రజలు ఉన్నారు. ఈ సమయంలో టైమ్స్ నౌ ఇండియా అవుట్ బ్రేక్ అంచనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆ అంచనాల ప్రకారం కరోనా మన దేశంలో కంట్రోల్ లోనే ఉంది. నాలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి త్వరలోనే అదుపులోకి రావచ్చని ఆ అంచనాలు చెబుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం వెలువరించిన మీడియా బులెటిన్లు, కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన రోజువారీ అప్‌‌డేట్ల సమాచారాన్ని ఉపయోగించి ప్రోటివిటి, టైమ్స్ నౌ చేసిన విశ్లేషణలో పలు ఆసక్తి కర అంశాలున్నాయి.

ఈ అంచనా ప్రకారం మన దేశంలో కరోనా రీ ప్రొడక్షన్ రేట్ మే 18 నాటికి 1.92 నుంచి 1.85కి తగ్గుతుంది. అప్పటికి యాక్టివ్ కరోనా కేసుల సంఖ్యా 40 వేలకు చేరుకునే చాన్స్ ఉంది. ఆరు రాష్ట్రాల్లో మే 3 తరువాత లాక్దౌన్ ఆంక్షలను సడలించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణా సహా కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్, హర్యానా, ఓడిశా రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఇటీవలి కాలంలో కరోనా రీ ప్రొడక్షన్ రేటును గణనీయంగా తగ్గించాయని ఆ అంచనాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, కేరళలో మే 18 నాటికి 3 యాక్టివ్ కేసులు మాత్రమే ఉంటాయనీ, ఒకవేళ పరిస్థతి కొంత మారినా గరిష్టంగా 182 యాక్టివ్ కేసులు ఉంటాయనీ రిపోర్ట్ అంచనా వేసింది.

ఇక మే 11 నాటికి ఆంధ్రప్రదేశ్లో కనిష్టంగా 861 యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందనీ, పరిస్థితి క్లిష్టంగా మారితే 1319 యాక్టివ్ కేసులు ఉండొచ్చనీ అంచనా. అదేవిధంగా మే 18 నాటికి గరిష్టంగా 1650 కేసులు, కనిష్టంగా 926 యాక్టివ్ కేసులు ఉంటాయని టైమ్స్ నౌ ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇక్కడ ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయని రిపోర్ట్ పేర్కొంది.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఇప్పుడే లాక్‌డౌన్ ఎత్తేస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని అంచనా వేసింది. మహారాష్ట్రలో మే 18 నాటికి గరిష్టంగా 23 వేలు, రాజస్థాన్ లో గరిష్టంగా 7 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండొచ్చని రిపోర్ట్ చెబుతోంది.


K V D Varma

K V D Varma

Next Story