Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించండి.. సుప్రీంకు కేజ్రీవాల్‌ వినతి..

Arvind Kejriwal: మధ్యంతర బెయిల్‌ గడువును జూన్ 7 వరకు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2024 10:48 AM IST
Arvind Kejriwal Requests Supreme Court To Extend Interim Bail By 7 Days
X

Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించండి.. సుప్రీంకు కేజ్రీవాల్‌ వినతి..

Arvind Kejriwal: మధ్యంతర బెయిల్‌ గడువును జూన్ 7 వరకు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీఈటీ- సిటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షల కోసం ఆయన గడువు కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. జూన్ 1 వరకు ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, మరి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం తెలిపింది. సీఎం ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు మరో ఏడు రోజులు బెయిల్‌ పొడిగించాలని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సుప్రీం కోర్టును అభ్యర్థించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story