India: భారత్‌కు పొంచి ఉన్న మరో తుపాను

India: తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం? * మే 23న వాయుగుండం, తుపానుగా మారే ఛాన్స్

Sandeep Eggoju
Published on: 19 May 2021 4:22 PM IST
Another Cyclone Effect on India
X

భారత్ కు పొంచి ఉన్న మరో ముప్పు (ఫైల్ ఇమేజ్)

India: తౌక్టే విధ్వంసం తర్వాత భారత్‌కు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ప్రారంభమై మే 23 ప్రాంతంలో వాయుగుండం, తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ.. ఈ అల్పపీడనం తీవ్ర రూపందాల్చే అవకాశం ఉందంది. వాతావరణ సూచన పరిధిలోకి ఈ పరిస్థితులు వచ్చిన వెంటనే స్పష్టంగా ప్రకటిస్తామని ఐఎండీ స్పష్టం చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story