గూగుల్ మ్యాప్స్ లో అదిరిపోయే ఫీచర్

An Awesome Feature in Google Maps
x

గూగుల్ మ్యాప్స్ లో అదిరిపోయే ఫీచర్ 

Highlights

Google Maps: ఈ ఫీచర్ ద్వారా హైదరాబాద్ నగరంలో అడ్రస్ కనుక్కోవడం ఇక చాలా ఈజీ

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా హైదరాబాద్ నగరంలో అడ్రస్ కనుక్కోవడం ఇక చాలా ఈజీ. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు గల్లీ దగ్గరకు వెళ్లగానే మన అడ్రస్ ఫోటోలతో సహా కనిపిస్తుంది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. గతంలోనే బెంగళూరులో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరో 8 నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇంట్లో కూర్చొనే నగరంలోని ఏ ప్రాంతాన్నయినా రియలిస్టిక్‌గా చూడవచ్చు. ల్యాండ్‌మార్క్‌లను సులభంగా గుర్తుపట్టవచ్చు. వెళ్లాలనుకున్న గమ్యానికి సులువుగా చేరుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నఫీచర్ ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. బెంగళూరు తర్వాత మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్‌లోనే ఆ తర్వాత కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, నాసిక్, వడోదరా, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ నగరాలకు కూడా వచ్చింది. ఈ పదింటితో పాటు ఈ ఏడాది చివరికల్లా దేశంలోని 50కి పైగా నగరాల్లో స్ట్రీట్ వ్యూ సదుపాయాన్ని తీసుకురావాలని గూగుల్ నిర్ణయించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories