
Viral Video: జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి క్రీడాకారులు...
Viral Video: జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకే 47 రైఫిల్స్, అమెరికన్ ఎం సిరీస్ కు చెందిన తొపాకులతో ఫుట్ బాల్ ఆడారు. మణిపూర్ కు చెందిన ఓ ఇన్ ఫ్లుయెన్సర్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియోపై మైతేయి వర్గాజికి చెందిన పౌర సమాజ సంస్థ హెరిటేజ్ సొసైటీ స్పందించింది. ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది. మణిపూర్ లో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ వైరల్ గా మారింది. క్రీడాకారులు బహిరంగంగా అధునాతన ఆయుధాలు ప్రదర్శించడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇది కుకీ మిలిటెంట్లు, ఫుట్ బాల్ టోర్నమెంటా దీని పై అధికారులు వెంటనే విచారణ జరపాలి అని సీఎం బీరెన్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసింది.
రాజధాని ఇంఫాల్ కు 30కిలోమీటర్ల దూరంలో కాంగ్ పోక్పీ జిల్లాలోని గామ్నోఫైలో ఈ ఫుట్ బాల్ టోర్నీ నిర్వహించినట్లు వీడియోలో ఉంది. గత నెల 20న ఈ మ్యాచ్ జరిగినట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ టోర్నీ నేపథ్యంలో ముదురు ఆకుపచ్చ దుస్తులు ధరించిన పలువురు స్టేడియం దగ్గర తుపాకులతో మోహరించిన సన్నివేశాలు ఈ వీడియోలో దర్శనమిచ్చాయి.
This video of a football tournament in Manipur has gone viral on social media. What is deeply disturbing is the open display of sophisticated weapons by the so called footballers. Or is it a football tournament of Kuki Militants?
— Meitei Heritage Society (@meiteiheritage) February 6, 2025
We urge the authorities to investigate this… pic.twitter.com/3IC5uY9BkH

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




