Coronavirus effect: చైనాను దాటిన అమెరికా ఒక్కరోజలోనే భారీ సంఖ్యలో..

Coronavirus effect: చైనాను దాటిన అమెరికా ఒక్కరోజలోనే భారీ సంఖ్యలో..
x
Highlights

ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. కరోనా కేసుల్లో చైనాను దాటింది అమెరికా. కరోనా ధాటికి అమెరికా విలవిలాడుతోంది.

ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. కరోనా కేసుల్లో చైనాను దాటింది అమెరికా. కరోనా ధాటికి అమెరికా విలవిలాడుతోంది.గురువారం ఒక్కరోజే 13వేల మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో వెంటిలేటర్స్ కొరత ఏర్పడింది. అమెరికా వ్యాప్తంగా 83వేల 5వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక న్యూయార్క్ లో ఇప్పటికే 469 మంది మృతి చెందారు. అయితే కరోనాను నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ట్రంప్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శలు వస్తున్నాయి.

ఇక మనదేశంలో కరోనా విజృంభిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ బాధితులు సంఖ్య 45కు పెరిగింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణికులు, వారితో సన్నిహితంగా తిరిగిన వ్యక్తులే ఉన్నారు. అయితే తాజాగా కరోనా నిర్ధారించిన నలుగురూ అంతర్జాతీయ ప్రయాణం చేయలేదని నిర్ధారణ అయింది. డీల్లీకి, తిరుపతికి ప్రయాణం అనంతరం వీరిలో కరోనా లక్షణాలు వెలుగులోకి వచ్చినట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఈ నలుగురినీ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిపై వైద్యఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 104 కాల్‌ సెంటర్‌కు ఇప్పటివరకూ 16,063 పోన్లు రాగా, అంతర్జాతీయ ప్రయాణికుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి 18,868 కాల్స్‌ చేశారు.

ఏపీలో గురువారం మరో కరోనా కేసు నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11కు చేరింది. స్వీడన్‌ నుంచి విజయవాడ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories