Alternative for Chinese apps in India: చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయంగా భారత యాప్స్

Alternative for Chinese apps in India:  చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయంగా భారత యాప్స్
x
Highlights

Alternative for Chinese apps in India: చైనా నుంచి ఏం వచ్చినా ఇండియాలో ఫుల్ క్రేజ్.. అది చైనా మోటరైనా. చైనా కుక్కరైనా.. క్షణాల్లో లక్షల్లో...

Alternative for Chinese apps in India: చైనా నుంచి ఏం వచ్చినా ఇండియాలో ఫుల్ క్రేజ్.. అది చైనా మోటరైనా. చైనా కుక్కరైనా.. క్షణాల్లో లక్షల్లో అమ్ముడుపోతాయి. అంతలా పాపులర్ అయ్యాయి చైనా ఐటమ్స్.. కానీ ఇప్పుడు చైనా వస్తువులకు నో చెబుతోంది భారత్. చివరకు చైనా యాప్స్ ని కూడా నిర్మోహాటంగా నిషేధించింది. వినోదం కంటే దేశభక్తే.. ఎక్కువ అని ఈ నిర్ణయం నిరూపించింది. అయితే ఈ యాప్స్ యూజర్స్ ఇప్పుడు లోకల్ యాప్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు.

చైనా-భారత్ మధ్య కొద్ది రోజులుగా అగ్గిరాజుకుంటోంది. సరిహదుల్లో మన దేశ సైనికులను అమానుషంగా హతమర్చారని దేశం చైనాపై మండిపడింది. చైనా దురహంకారాన్ని భారతదేశం దిక్కరించింది. చైనా వస్తువులను నిషేధించాలని భారత ప్రజలు నినదించారు. ప్రజల్లోంచి వస్తున్న డిమాండ్ మేరకు చైనాకు సంబంధించిన 59 యాప్స్ ని పూర్తిగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.

చైనాకు చెందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, హలో వంటి యాప్స్ కి ఇండియాలో కోట్లల్లో యూజర్స్ ఉన్నారు. రోజంతా వాటితోనే గడిపేవారు కోకొల్లలు. కానీ ఇప్పుడు వాటన్నింటిపై కేంద్రం కొరడా జులిపించింది. దీంతో వాటికి అడిక్ట్ అయిన నెటిజన్లు లోకల్ యాప్స్ పై దృష్టిపెట్టారు. చైనా యాప్స్ కి ప్రత్యామ్నాయంగా మన దేశంలో ఏ యాప్స్ ఉన్నాయంటూ సెర్చ్ చేస్తున్నారు.

యాప్స్ యూజర్స్ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు ప్రముఖ ఐటీ నిపుణుడు శ్రీధర్. గూగుల్ స్టోర్ లో చైనా యాప్స్ కి ప్రత్యామ్నాయంగా అనేక యాప్స్ ఉన్నాయంటూ వెల్లడించారు. చైనా యాప్స్ నిషేధాన్ని భారత యువత స్వాగతిస్తోంది. ఇన్నాళ్లు చైనా యాప్స్ వినియోగించి, ఆ దేశానికి మేలు చేశామని అంటున్నారు. కానీ ఇప్పుడు లోకల్ యాప్స్ వాడి భారత ఖ్యాతిని చాటుదామని యువత పిలుపునిస్తోంది.

ఇండియాకు చెందిన చింగారీ యాప్ డౌన్ లోడ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ వచ్చేసింది. ప్లేస్టోర్ లోనే ఇప్పటి వరకు 50 లక్షల పైగా డౌన్ లోడ్స్ అయ్యాయంటే మాటలు కాదు. బెంగళూరుకు చెందిన బిస్మాత్మనాయక్, సిద్దార్థ్ గౌతమ్ గతేడాది చింగారీ యాప్ ను రూపొందించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories