Akhilesh Yadav: యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం

Akhilesh Yadav: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటన

Sandeep Eggoju
Updated on: 1 Nov 2021 3:58 PM IST
Akhilesh Yadav Announced as Not Contest in Assembly Elections,
X
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించిన అఖిలేహ్స్ యాదవ్ (ఫైల్ ఇమేజ్)

Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ ప్రకటించారు. కేవలం సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారంలో పాల్గొంటానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ మధ్య పొత్తు ఉంటుందన్నారు.

ఆర్‌ఎల్డీతో పొత్తు ఫైనల్ అయ్యిందని, కేవలం సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story