Air India Plane: వంతెన కింద ఇరుక్కున ఎయిర్‌ ఇండియా విమానం

Air India Plane: తరలిస్తుండగా ఎన్‌సీఆర్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన వైనం... వైరల్ అవుతున్న వీడియో

Shireesha
Updated on: 4 Oct 2021 11:33 AM IST
Air India Plane Stucked Under Bridge at Delhi-Gurgav Highway | Trending News Today
X

వంతెన కింద ఇరుక్కున ఎయిర్‌ ఇండియా విమానం

Air India Plane: ఎయిర్‌ ఇండియాకు చెందిన ఓ విమానం వంతెన కింద ఇరుక్కుంది. ఢిల్లీ-గుర్గావ్‌ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపు వంతెన కింద ఇరుక్కున రెక్కలు లేని విమానం కనిపించింది. దీనిపై స్పందించిన ఎయిర్‌ ఇండియా.. ప్రమాదం ఏదీ జరగలేదని తెలిపింది.

తాము అమ్మేసిన పాత విమానాన్ని కొన్న వ్యక్తి ట్రాలీలో తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్‌ అయినట్లు చెప్పింది. ఈ ఘటనతో ఎయిర్‌ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


Shireesha

Shireesha

Next Story