టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత

Air India hands over to Tatas
x

టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత

Highlights

Air India: 69 ఏళ్ల తరువాత ఎయిర్‌ ఇండియా మళ్లీ టాటాల సొంతం కాబోతోంది. నేడు అధికారికంగా టాటాలకు ఎయిర్‌ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించబోతోంది.

Air India: 69 ఏళ్ల తరువాత ఎయిర్‌ ఇండియా మళ్లీ టాటాల సొంతం కాబోతోంది. నేడు అధికారికంగా టాటాలకు ఎయిర్‌ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించబోతోంది. ఆమేరకు అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2021లో బిడ్డింగ్‌ నిర్వహించింది. టాటా అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రయివేటు లిటిమెటడ్‌ 18వేల కోట్లకు ఎయిర్‌ ఇండియాను దక్కించుకుంది. 2021 అక్టోబరు 8న టాటాతో విక్రయ ఒప్పందానికి ఆమోదం లభించింది. అక్టోబరు 25న విక్రయ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది.

89 ఏళ్ల క్రితం 1932లో టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ను జేఆర్‌డీ టాటా ప్రారంభించారు. 1953లో జాతీయికరణలో భాగంగా టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో టాటా ఎయిర్‌ సర్వీసెస్‌... ఎయిర్‌ ఇండియాగా మారింది. విమానయాన రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాక ఎయిరిండియా తన మార్కును క్రమంగా కోల్పయింది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అనంతరం నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించగా టాటాలు దక్కించుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories