Air India Flight Crash: కూలిన ఎయిర్‌ ఇండియా విమానం..!

Air India Flight Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Updated on: 12 Jun 2025 3:02 PM IST
Air India Flight Crash Ahmedabad Breaking News
X

Air India Flight Crash: కూలిన ఎయిర్‌ ఇండియా విమానం..!

Air India Flight Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌ఇండియాకి చెందిన ఓ విమానం మేఘానీనగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

వివరాల్లోకి వెళ్తే, అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరే క్రమంలో టేకాఫ్ అవుతుండగా, ఈ విమానం అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టి కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలిసింది.

ప్రస్తుతం ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి అధికారులు చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగు చూడలేదు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story