కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్రపోషించిన ఆ విమానాలకు వీడ్కోలు!

Arun Chilukuri
Updated on: 27 Dec 2019 12:15 PM IST
కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్రపోషించిన ఆ విమానాలకు వీడ్కోలు!
X
మిగ్-27

యుద్ధాల్లో సైనికులతో పాటు వైమానిక దళం కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ యుద్ధవిమానాల్లో ఇప్పటి వరకూ మిగ్ విమానాలు తనదైన శైలిలో ప్రధాన పాత్రనే పోషిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మిగ్-27 దేశానికి ఎన్నో సేవలను అందించింది. నాలుగు దశాబ్దాలు అంటే 38 ఏళ్లపాటు వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన ఈ మిగ్-27 యుద్ధ విమానాలు కనుమరుగు కానున్నాయి. 1999 నాడు జరిగిన కార్గిల్‌ యుద్ధం సందర్భంగా ఆపరేషన్ సేఫ్‌డ్ సాగర్‌లో ఈ విమానాలు కీలకంగా వ్యవహరించాయి. అయినప్పటికీ వీటికి వీడుకోలు పలికే సమయం రావడంతో వాయుసేన మిగ్-27కు వీడ్కోలు పలుకుతోంది.

జోధ్‌పూర్‌లో 29వ స్వ్కాడ్రన్‌కు చెందిన సిబ్బంది మిగ్ 27 బహదూర్‌ను చివరిసారిగా నడుపుతున్నారు. ఈ చివరి ఘట్టం ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడనుంది. చివరిసారిగా ఆకాశంలో ఈ విమానాలు విహరిస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఈ యుద్ధ విమానాల పనితీరు అధికారులను అంతగా సంతృప్తి పరచడం లేదని తెలుస్తుంది. మిగ్ -27 విమానాలు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఇకపై రష్యా నుంచి ఎలాంటి యుద్ధ విమానాలు కొనుగోలు చేయవద్దని, రష్యా నుంచి దిగుమతి చేసిన మిగ్‌లు సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర సమయంలో ఇప్పటివరకూ చాలా యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయని అధికారుల చెపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story