AICC Meeting: సోనియా అధ్యక్షతన ఏఐసీసీ సమావేశం

AICC Meeting: సీడబ్ల్యూసీ తీర్మానాలు అమలు చేయాలన్న సోనియా

Sandeep Eggoju
Updated on: 26 Oct 2021 2:35 PM IST
AICC Meeting Chaired by Sonia Gandhi
X

సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

AICC Meeting: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ 1 నుంచి మొదలై 2022 మార్చి 31న ముగుస్తుందన్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ మీ అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రాణాధారం అని దేశంలో యువత తమ గొంతు వినిపించాలని ఎదురుచూస్తున్నారన్నారు సోనియా గాంధీ. వారికి ఒక వేదికను అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని పేర్కొన్నారు.

బీజేపీ-ఆరెస్సేస్ సైద్ధాంతిక ప్రచారంపై పోరాడాలన్నారు. వారి అవాస్తవాలను బయటపెట్టి, ఈ యుద్ధంలో గెలవాలని కోరారు. ఇక విధానపరంగా రాష్ట్రస్థాయి నేతల మధ్య స్పష్టత లోపించిందని బీజేపీ-ఆరెస్సెస్ భావజాలాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేయాలని సోనియా సూచించారు. వారికి తగిన శిక్షణనివ్వాలని ఆదేశించారు. అన్యాయం, అసమానతలపై పార్టీ పోరాడాలని క్షేత్రస్థాయిలో పోరాటాలు, ఆందోళనలు చేపట్టాలని ఆదేశించారు. మోడీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. తద్వారా జవాబుదారీతనం లేకుండా చేయాలని చూస్తోందన్నారు. ప్రజాస్వామ్య మూలాలను, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోందని సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story