Pegasus: పెగసస్.. దేశ భధ్రతతో ముడిపడిన సున్నితమైన అంశం

Pegasus: అనుమానాలు నివృత్తి చేయడానికి నిపుణులతో కమిటీ *సుప్రీంకోర్టులులో క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం

Sandeep Eggoju
Published on: 17 Aug 2021 8:01 AM IST
Again Supreme Court Hearing on Pegasus Today
X

మరోసారి పెగాసస్ పై సు[ప్రేమే కోర్ట్ విచారణ (ఫైల్ ఇమేజ్)

Pegasus: పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో దాచేయడానికి ఏం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్రం ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసింది.. అయితే, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మసనం పేర్కొంది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ కొనసాగిస్తామని ధర్మసనం వెల్లడించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story